Ravindra Jadeja: ‘గెటింగ్ బెటర్’ అంటూ గాయంపై అప్డేట్ ఇచ్చిన జడేజా
- ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేయనున్న సెలక్టర్లు
- తొలి టెస్టులో గాయపడిన జడేజా
- జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో విజయం సాధించి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. చివరి మూడు టెస్టుల కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు.
తొలి టెస్టులో గాయపడిన జడేజా విశాఖలో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్టర్లు సిద్ధమవుతున్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి తన ఫొటోను షేర్ చేస్తూ ‘గెటింగ్ బెటర్’ అంటూ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. దీనిని బట్టి జడేజా చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావించొచ్చు.
వైజాగ్ టెస్టులో వీరవిహారం చేసిన జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న తొలి ఇండియన్ పేసర్‌గా రికార్డులకెక్కాడు. 30 ఏళ్ల బుమ్రా ఆ టెస్టులో 9 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా పాట్ కమిన్స్, కగిసో రబడ, రవిచంద్రన్ అశ్విన్‌లను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అతడికంటే ముందు అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్‌సింగ్ బేడీ ఉన్నారు.