Ram Gopal Varma: పార్టీ చేసుకుంటూ.. 'వ్యూహం' రిలీజ్ డేట్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma announces Vyuham release date

  • ఫిబ్రవరి 23న సినిమా విడుదల కాబోతోందన్న వర్మ
  • అడ్డంకులన్నీ తొలగిపోయాయని వెల్లడి
  • వ్యూహం రిలీజ్ ను సెలెబ్రేట్ చేసుకుంటున్నామన్న ఆర్జీవీ

తన తాజా చిత్రం 'వ్యూహం' విడుదల కు లైన్ క్లియర్ అయిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. ఈ నెల 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోందని తెలిపారు. ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'హేయ్ నారా లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహం రిలీజ్ ను మేము సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ కాబోతోంది. టీడీపీని తాగేయడానికి, జనసేనను తినేయడానికి మేము వస్తున్నాం' అని ట్వీట్ చేశాడు. 

.

  • Loading...

More Telugu News