Cadbury chocolate: క్యాడ్ బరీ చాక్లెట్ లో పురుగు.. హైదరాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో!

Hyderabad Man Finds Worm Crawling In Dairy Milk Chocolate

  • అమీర్ పేట మెట్రో స్టేషన్ లోని షాపులో కొనుగోలు
  • చాక్లెట్ లో పురుగును చూసి వీడియో తీసిన కస్టమర్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. స్పందించిన కంపెనీ

తియ్యని వేడుక చేసుకుందాం.. అంటూ టీవీలో ప్రకటనలు ఇచ్చే డైరీ మిల్క్ కంపెనీ ఓ కస్టమర్ కు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. పిల్లల కోసం కొని తీసుకెళ్లిన చాక్లెట్ లో ఓ పురుగు కనిపించింది. దీంతో ఖంగుతిన్న సదరు వినియోగదారుడు.. కదులుతున్న ఆ పురుగును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న పిల్లలు తినే చాక్లెట్ లో ఇలా పురుగు కనిపించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కంపెనీని కోర్టుకు ఈడ్చాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి శుక్రవారం మెట్రోలో ఇంటికి తిరిగివెళ్తూ పిల్లల కోసమని ఓ చాక్లెట్ కొనుగోలు చేశాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్ లోని ఓ రిటైల్ షాపులో క్యాడ్ బరీ చాక్లెట్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా.. చాక్లెట్ పై పురుగు కనిపించింది. అదీ కూడా కదలుతుండడంతో రాబిన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే మొబైల్ ఫోన్ తో వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఎక్స్ పైరీ గడువు ముగిసిన చాక్లెట్ ను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ట్వీట్ కు నెటిజన్లతో పాటు జీహెచ్ ఎంసీ అధికారులు, క్యాడ్ బరీ డైరీ మిల్క్ కంపెనీ కూడా స్పందించాయి. తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ చేశాయి.

  • Loading...

More Telugu News