Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్లో భారత్ టార్గెట్ 254 రన్స్
- దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
- నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు
- రాజ్ లింబానీకి 3 వికెట్లు... 2 వికెట్లు పడగొట్టిన నమన్ తివారీ
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో నేడు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే, భారత్ బౌలర్లు ఆసీస్ బ్యాట్స్ మెన్ ను సమర్థంగా కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 7 వికెట్లకు 253 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి ఆటగాడు హర్జాస్ సింగ్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హ్యారీ డిక్సన్ 42, కెప్టెన్ హ్యూ వీబ్జెన్ 48, ఒలివర్ పీక్ 46, ర్యాన్ హిక్స్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2, సౌమీ పాండే 1, ముషీర్ ఖాన్ 1 వికెట్ తీశారు.