BRS: రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
- వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన కేసీఆర్
- రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
- రేణుకా చౌదరి, అనిల్ కుమార్ లకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లను బరిలోకి దించింది. బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఉన్న బలాన్ని బట్టి కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక రాజ్యసభ సీటు దక్కనున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. వద్దిరాజు రేపు నామినేషన్ వేయనున్నారు.
వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం కల్పించారు. 2022లో ఆయనకు తొలిసారి రాజ్యసభ అవకాశం దక్కింది. తొలి దఫాలో ఆయన రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రెండోసారి ఇప్పుడు ఆయన పూర్తి కాలంపాటు పదవిలో కొనసాగబోతున్నారు.