Rajkot Test: రాజ్ కోట్ టెస్ట్.. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

Team India lost 3 wickets for 33 runs in Rajkot test
  • ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తడబడిన టాపార్డర్
  • డకౌట్ అయిన శుభ్ మన్ గిల్
  • 19 పరుగులతో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ
రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ తడబడింది. కేవలం 33 పరుగులకే ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10 పరుగులకు, రజత్ పటిదార్ 5 పరుగులకు ఔట్ కాగా... 9 బంతులను ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (19), రవీంద్ర జడేజా (3) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా... టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం ఇండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు.
Rajkot Test
Team India
Team England
Score

More Telugu News