Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈరోజు కూడా లోయర్ సర్క్యూట్ ను తాకిన పేటీఎం షేర్లు

Markets ends in profits

  • 228 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 71 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఆరున్నర శాతం లాభపడ్డ ఎం అండ్ ఎం షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగినప్పటికీ... చివరకు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 72,050కి పెరిగింది. నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 21,911 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (6.51%), ఎన్టీపీసీ (3.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.46%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.15%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.11%), ఐటీసీ (-1.85%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.58%), నెస్లే (-1.32%), సన్ ఫార్మా (-0.79%). 

పేటీఎం షేర్లు ఈరోజు మరో 5 శాతం క్షీణించి రూ. 325.05 వద్ద ముగిశాయి. ఈ కంపెనీ షేర్లు ప్రతి రోజూ దారుణంగా పడిపోతుండటంతో... ఈ సంస్థ లోయర్ సర్క్యూట్ లిమిట్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాయి. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 83.04గా ఉంది.

  • Loading...

More Telugu News