AP High Court: సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

Hearing in the High Court on the petition filed by MP Raghurama Krishna Raju against CM Jagan

  • ఏపీ హైకోర్టులో గురువారం మొదలైన విచారణ
  • వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు
  • తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం

సీఎం జగన్‌ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ మొదలైంది. సీఎం జగన్‌ అవినీతికి పాల్పడ్డారని పిటిషనర్‌ తరఫు లాయర్ ఉన్నం మురళీధర్‌ వాదనలు వినిపించారు. సీబీఐ కేసులో తనతో పాటు ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని అన్నారు. 

ప్రభుత్వం తరఫున ఏజీ కౌంటర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ రఘురామకృష్ణ రాజు పిల్‌ వేసేందుకు అనర్హుడని వాదించారు. పిటిషనర్‌, సీఎంకు మధ్య విభేదాలు ఉన్నాయని అన్నారు. పిటిషనర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయిన విషయం బయటకు చెప్పలేదని అన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు మార్చి 4కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 

కాగా సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, తన అనుయాయులకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై కేంద్రం దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News