Rahul Dravid: కాంట్రాక్ట్ ముగిసినా కోచ్‌గా కొనసాగుతున్న ద్రవిడ్.. ఎప్పటి వరకో చెప్పిన జైషా!

Jay Shah clarifies on Rahul Dravid Feature

  • గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ముగిసిన ద్రవిడ్ కాంట్రాక్ట్
  • ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్ వరకు కొనసాగమని బీసీసీఐ అభ్యర్థన
  • జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగుతాడన్న జైషా

టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ముగిసింది. అయినప్పటికీ ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మరెంతకాలం కొనసాగుతాడన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ద్రవిడ్ కొనసాగుతాడని ఆయన పేర్కొన్నారు.

గతేడాది ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబర్-జనవరిలో జరగనున్న సౌతాఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయితే అది ఎంతకాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. ద్రవిడ్‌తో తాను మాట్లాడానని వెస్టిండీస్-అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని కోరినట్టు జైషా నిన్న వెల్లడించారు. ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ వెంటనే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లడంతో అప్పుడు మాట్లాడడం కుదరలేదని, అదిప్పుడు జరిగిందని తెలిపారు.

‘‘రాహుల్ ద్రవిడ్ లాంటి సీనియర్ కాంట్రాక్ట్ గురించి మీరెందుకు చింతిస్తున్నారు? టీ20 ప్రపంచకప్ వరకు రాహుల్ భాయ్ కోచ్‌గా ఉంటాడు’’ అని షా నొక్కి చెప్పారు. ‘‘సమయం దొరికినప్పుడు రాహుల్‌తో మాట్లాడతా. ప్రస్తుతం వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. అప్పుడేమో సౌతాఫ్రికా టూర్, ఆ వెంటనే స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్, ఇప్పుడేమో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్. ఈ నేపథ్యంలో అతడితో మాట్లాడడం కుదరలేదు’’ అని షా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News