Ravichandran Ashwin: 500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్
- రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు
- ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్
- టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం
- కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్
టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ(15)ని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ రికార్డు పుటల్లోకెక్కాడు. కుంబ్లే ఈ మైలురాయిని అందుకోవడానికి 105 టెస్టులు ఆడగా, అశ్విన్ 98 టెస్టుల్లోనే ఈ ఘనతను నమోదు చేయడం విశేషం. శ్రీలంక ఆఫ్ స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ కేవలం 87 టెస్టుల్లోనే 500 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.