KCR: కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై, కేటీఆర్

Tamilisai and KTR extend birthday wishes to former CM KCR
  • నేడు పుట్టినరోజును జరుపుకుంటున్న కేసీఆర్
  • కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన గవర్నర్
  • తన తండ్రి తన హీరో అన్న కేటీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి కేటీఆర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. 'గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. 'లెజెండ్ అయిన నా హీరోకు... 70వ జన్మదిన శుభాకాంక్షలు డాడ్' అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేశారు. 

KCR
KTR
BRS
Tamilisai Soundararajan
TS Governor

More Telugu News