Shiva: వర్మ టాలెంట్ నాకు ఆ రోజునే అర్థమైపోయింది: సినిమాటోగ్రఫర్ ఎస్. గోపాల్ రెడ్డి

S Gopal Reddy Interview

  • షూటింగ్స్ చూడటానికి తనతో పాటు లొకేషన్స్ కి వచ్చేవాడన్న గోపాల్ రెడ్డి  
  • వర్మ కథ చెప్పే తీరు, కాన్ఫిడెన్స్ చూడగానే టాలెంటెడ్ అని అర్థమైందని వెల్లడి   
  • సౌండ్ ఎఫెక్ట్స్ లో మార్పు తెచ్చింది ఆయనేనని వ్యాఖ్య


తెలుగులో సినిమాటోగ్రఫర్ గా ఎస్. గోపాల్ రెడ్డి ఎన్నో సినిమాలకి పనిచేశారు. రామ్ గోపాల్ వర్మ ఫస్టు మూవీ 'శివ' సినిమాకి ఛాయాగ్రాహకుడు ఆయనే. తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"రామ్ గోపాల్ వర్మ దర్శకుడు కాకముందే, షూటింగ్స్ చూడటానికి నాతో పాటు లొకేషన్స్ కి వచ్చేవాడు. ఆ తరువాతనే ఆయన నాకు 'శివ' కథ చెప్పారు. అప్పటివరకూ తెలుగు తెరపై నడుస్తూ వస్తున్న ట్రెండ్ వేరు. వర్మ కథ చెప్పే తీరు .. ఆయనలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ ను చూడగానే ఆయన చాలా టాలెంటెడ్ అనే విషయం నాకు అర్థమైపోయింది" అని అన్నారు.

"తెలుగులో అంతకుముందు సౌండ్ ఎఫెక్ట్స్ పై పెద్దగా దృష్టి పెట్టినవారు లేరు. కానీ వర్మ వస్తూనే సౌండ్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టాడు .. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకున్నాడు. సౌండ్ ఎఫెక్ట్స్ లోను .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోను ఒక మార్పు అనేది వర్మతోనే మొదలైంది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News