Best CM: మోస్ట్ పాపులర్ సీఎంలలో యోగికి రెండో స్థానం.. ఫస్ట్ ఎవరంటే..!

Naveen Patnaik Is The Most Popular Chief Minister says Mood Of The Nation Survey

  • ప్రజాదరణలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టాప్
  • మూడో స్థానంలో అసోం సీఎం హిమంత
  • మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వేలో వెల్లడి

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 51.3 రేటింగ్ తో యోగి రెండో స్థానంలో నిలవగా.. 52.7 శాతం ఓట్లతో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానం దక్కించుకున్నారు. వివాదరహితుడిగా పేరున్న నవీన్ పట్నాయక్ ను ఈ సర్వేలో ప్రజలు బెస్ట్ సీఎంగా తేల్చారు. ఇక, 48.6 శాతం ఓట్లతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కు 42.6 శాతం ఓట్లు దక్కాయి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు ఈ సర్వేలో 41.4 శాతం ఓట్లు దక్కాయి. ప్రజాదరణలో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.

మాణిక్  సాహా తర్వాతి స్థానంలో 41.1 శాతం ఓట్లతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, 40.1 శాతం ఓట్లతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ లిస్టులో ఆరు, ఏడో స్థానాల్లో నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఓటర్లు ఎనిమిదో స్థానం కట్టబెట్టారు. ఈ సర్వేలో కేజ్రీవాల్ కు కేవలం 36.5 శాతం మంది మాత్రమే ఓటేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 35.8 శాతం ఓట్లతో తొమ్మిదో స్థానంలో, 32.8 శాతం ఓట్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News