Mammootty: హిట్ కొట్టిన 'భ్రమయుగం' .. ఈ సినిమా కథేమిటి?
- మలయాళంలో విడుదలైన 'భ్రమయుగం'
- హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న మమ్ముట్టి
- పూర్తి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది
మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. ఒక చిన్న లైన్ .. లేదంటే ఒక చిన్న పాయింట్ పట్టుకుని సెట్స్ పైకి వెళ్లిపోతారు. స్టార్ కాస్ట్ కాకుండా తెరపై పాత్రలు కనిపించేలా తీర్చిదిద్దుతారు. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం వలన ఎక్కువ రిస్క్ ఉండదు. అలా చేసిన ప్రయోగాత్మక చిత్రమే 'భ్రమయుగం'. పూర్తి బ్లాక్ అండ్ వైట్ తో ఈ సినిమాను రూపొందించడమే మేకర్స్ చేసిన సాహసం అని చెప్పాలి.
ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ తోనే రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. అలాగే థియేటర్లను కూడా పెంచుతున్నారు. డిఫరెంట్ లుక్ తో మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాను నిర్మించారు. కథాపరంగా చూసుకుంటే ఇది ఆంగ్లేయుల కాలంలో కేరళలో జరిగిన సంఘటనగా తెరపైకి వస్తుంది.
కేరళలోని ఒక ఇంట్లో కథానాయకుడు తన వంటవాడితో కలిసి ఒక పాత ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. ఒక రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంటికి వచ్చిన ఒక కొత్త వ్యక్తి, కథానాయకుడిని ఆశ్రయం కోరతాడు. ఆ తరువాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. కానీ ఆ ఇంట్లో నుంచి బయటపడలేకపోతాడు. అందుకు కారణం ఏమిటి? అప్పుడతను ఏం చేస్తాడు? అనేది కథ. త్వరలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.