YS Sharmila: కల్యాణ వైభోగమే... కుమారుడి పెళ్లి ఫొటోలు పంచుకున్న షర్మిల
- షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం
- రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా పరిణయ మహోత్సవం
- హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా జరిగింది. రాజారెడ్డి-ప్రియా పెళ్లి వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేర్వేరుగా నిర్వహించారు. కాగా, షర్మిల తన కుమారుడి కల్యాణ వైభోగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలంబ్రాలు వేడుక ఫొటోలను, ఇతర ఫొటోలను ఎక్స్ లో పోస్టు చేశారు.