Alla Ramakrishna Reddy: మళ్లీ వైసీపీ గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. విజయసాయిరెడ్డి సుదీర్ఘ మంతనాలు?
- నేడు తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి జగన్ ను కలుస్తున్న ఆర్కే
- మంగళగిరిలో లోకేశ్ ను ఓడించడమే వైసీపీ లక్ష్యం
- ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఆర్కే
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి (ఆర్కే) మళ్లీ వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఆర్కేతో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న రాత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈరోజు తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆర్కే కలవబోతున్నారని తెలుస్తోంది. మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ఈ మేరకు పావులు కదుపుతోందని చెపుతున్నారు.
మంగళగిరి నుంచి ఆర్కే 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో నారా లోకేశ్ ను ఓడించారు. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడంతో... ఆయన అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీగా గంజి చిరంజీవిని నియమించడంతో మనస్తాపానికి గురైన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.