Atluri Purnachandra Rao: ఆ సినిమా మొదలుపెట్టే సమయానికి నా దగ్గరున్నది ఐదు రూపాయలే: సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు

Atluri Purnachandra Rao Interview

  • 'అగ్గిమీద గుగ్గిలం' సినిమాతో నిర్మాతగా మారానన్న అట్లూరి  
  • ఆరంభంలో ఇబ్బందులు పడ్డానని వెల్లడి 
  • రిక్వెస్టులతో ఫస్టు మూవీ మొదలైందని వ్యాఖ్య
  • 9 భాషల్లో 87 సినిమాలు నిర్మించానని వివరణ 


సీనియర్ నిర్మాతగా అట్లూరి పూర్ణచంద్రరావుకి మంచి పేరు ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి సినిమాలను నిర్మించిన అనుభవం ఆయన సొంతం. అలాంటి పూర్ణచంద్రరావు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో నిర్మాతగా తన ప్రయాణాన్ని గురించి ప్రస్తావించారు.

"కెరియర్ ఆరంభంలో ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా నేను సొంత బ్యానర్లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా నేను కాంతారావు హీరోగా 'అగ్గిమీద గుగ్గిలం' సినిమాతో నిర్మాతగా మారాను. ఆ సినిమా తీయాలనుకున్న సమయానికి నా దగ్గర ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ ఐదు రూపాయలతో పూజా కార్యక్రమాలు కానిచ్చేశాను" అని అన్నారు.

" షూటింగుకి ముందే నేను దర్శకుడితో పాటు హీరో హీరోయిన్లను ... విలన్ ను పిలిచి, ' నా దగ్గర డబ్బులేదు .. మీకు ఇప్పుడు అడ్వాన్స్ గా ఏమీ ఇవ్వలేను. మీ పారితోషికాలు ఎంత అనేది ఒక కాగితంపై రాసి కవర్లో పెట్టి ఇవ్వండి. సినిమా పూర్తయిన తరువాత మీకు డబ్బు ఇస్తాను. ఆ తరువాతనే రిలీజ్ చేసుకుంటాను' అని అన్నాను. అలా ఆ సినిమాను పూర్తి చేసిన నేను, ఆ తరువాత 9 భాషల్లో 87 సినిమాలను నిర్మించాను" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News