Vishwaksen: అర్జున్ తో గొడవపై స్పందించిన విష్వక్ సేన్!

Vishwaksen Interview
  • కూతురును టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకున్న అర్జున్ 
  • హీరోగా తీసుకున్న విష్వక్ సేన్ ధోరణి పట్ల అసహనం 
  • అతనికి కమిట్ మెంట్ లేదని గతంలో ప్రెస్ మీట్ పెట్టిన అర్జున్
  • ఆ గొడవపై తాజాగా స్పందించిన విష్వక్ సేన్  
  • రెట్టింపు డబ్బు వెనక్కి ఇచ్చేశానని వెల్లడి

విష్వక్ సేన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు.  ఆ సినిమా ద్వారా ఆయన తన కూతురు ఐశ్వర్యను తెలుగు తెరకి పరిచయం చేయాలనుకున్నారు. అయితే ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టిన అర్జున్, విష్వక్ కమిట్ మెంట్ లేని నటుడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

తాజా ఇంటర్వ్యూలో విష్వక్ సేన్ కి ఈ అంశానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. " నేను ఒక రోజు షూటింగ్ ఆపమని చెప్పానంతే. అంతే తప్ప సినిమాను కేన్సిల్ చేయమని అనలేదు. నాకు సినిమా నేపథ్యం లేకపోవడం వలన, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయినా నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు" అన్నాడు. 

"నిజానికి ఈ విషయంపై నేను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న దానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశాను. ఆయన కోపంతో తీసుకున్న నిర్ణయం వలన, ఎక్కువగా నష్టపోయింది నేనే" అని విష్వక్ సేన్ చెప్పాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చే నెల 8వ తేదీన 'గామి' విడుదల కానుంది. ఇక 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా కూడా లైన్లోనే ఉంది.
Vishwaksen
Arjun
Aishwarya

More Telugu News