Divya Sripada: 'మైనా' పాత్ర నా కెరియర్లో ప్రత్యేకం : దివ్య శ్రీపాద

Divya Sripada Interview
  • ఆకర్షణీయమైన కళ్లతో ఆకట్టుకునే దివ్య శ్రీపాద
  • 'సుందరం మాస్టర్'లో దక్కిన ముఖ్యమైన రోల్ 
  • 'మైనా' పాత్రలో మెప్పిస్తానని చెప్పిన బ్యూటీ 
  • ఈ నెల 23వ తేదీన విడుదల కానున్న సినిమా

దివ్య శ్రీపాద .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా మంచిపేరు తెచ్చుకుంది. అయితే ఆమె కళ్లకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. అందువల్లనే 'స్వాతిముత్యం' .. 'యశోద' వంటి సినిమాల్లో ఆమె పాత్ర అలా గుర్తుండిపోతుంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సుందరం మాస్టర్' సిద్ధమవుతోంది. 

వైవా హర్ష కథానాయకుడిగా 'సుందరం మాస్టర్' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో లీడ్ రోల్ ను దివ్య శ్రీపాద పోషించింది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీమ్ ఇంటర్వ్యూలో దివ్య శ్రీపాద మాట్లాడింది. 

" ఈ సినిమాలో నేను 'మైనా' అనే ఒక గిరిజన యువతి పాత్రను పోషించాను. నా పాత్రకి తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎక్కువ హావభావాలతోనే విషయం చెబుతూ ఉంటాను. ఈ తరహా పాత్రను చేయడం ఇదే మొదటిసారి. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది ..  నా కెరియర్ కి ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పింది. 
Divya Sripada
Viva Harsha
Sundaram Master

More Telugu News