IPL 2024: ముందుగా 10-12 రోజులకే ఐపీఎల్ 2024 షెడ్యూల్.. ఎందుకంటే..!

IPL 2024 to start on March 22 and schedule will realed for the first 10 tp 12 days
  • ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించాకే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చే అవకాశం
  • ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్‌ను ఉటంకిస్తూ పేర్కొన్న క్రిక్‌బజ్ రిపోర్ట్
  • 10 కంటే ఎక్కువ వేదికల్లో మ్యాచ్‌లు జరగవచ్చని పేర్కొన్న నివేదిక
క్రికెట్ అభిమానుల్లో ఎనలేని క్రేజ్ కలిగివున్న ఐపీఎల్ సరిగ్గా మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22 నుంచి షురూ కానుందని ఇటీవలే ఐపీఎల్ పాలకులు నిర్ధారించారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించి మొదటి 10-12 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయనున్నారని ‘క్రిక్‌బజ్’ రిపోర్ట్ పేర్కొంది. 

సార్వత్రిక ఎన్నికలు-2024 తేదీలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఎన్నికల తేదీపై భారత ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చాక ఐపీఎల్  టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారని వివరించింది. తొలి 10-12 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించనున్నామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ను ఉటంకిస్తూ క్రిక్‌బజ్ రిపోర్ట్ పేర్కొంది. ఆరంభంలో మొదటి 10-12 రోజుల షెడ్యూల్ మాత్రమే వెల్లడించనున్నామని అన్నారని పేర్కొంది. కాగా ఆతిథ్య వేదికలు 10 కంటే ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉండనున్నాయని తెలుస్తోందని రిపోర్ట్ పేర్కొంది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి రెండవ, మూడవ వారాల మధ్య ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ వెల్లడికానుంది.

కాగా ఐపీఎల్2024 సీజన్ వచ్చే నెల మార్చి 22 నుంచి ప్రారంభం కానుందని ఇటీవలే నిర్ధారణ అయ్యింది. ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ ఈ విషయాన్ని నిర్ధారించారు. చెన్నైలో తొలి మ్యాచ్ జరగనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఇంకా తమకు సమాచారం అందలేదని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతానికి ప్రత్యర్థి జట్లపై ప్రస్తుతానికి ఎలాంటి ఎలాంటి సమాచారం లేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. కాగా ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
IPL 2024
IPL
Election Commission
Arun Dhumarl
Cricket

More Telugu News