Kirak RP: అసలు 'నెల్లూరు పెద్దారెడ్డి' అంటే ఎవరో నాకూ తెలియదు: 'జబర్దస్త్' కిరాక్ ఆర్పీ
- 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన ఆర్ఫీ
- నాగబాబు మానేసిన తరువాత ఆ స్టేజ్ కి దూరం
- నాగబాబుగారు ఉంటే ఆ హోదా వేరేనని వ్యాఖ్య
- చేపల పులుసు బిజినెస్ గురించిన వివరణ
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. అలాంటివారి జాబితాలో 'కిరాక్ ఆర్ఫీ' కూడా ఒకరు. ఆర్ఫీకి ఒక ప్రత్యేకమైన మేనరిజం ఉంది. అందువలన ఆయన స్కిట్స్ పట్ల చాలామంది ఆసక్తిని చూపించేవారు. అలాంటి ఆయన 'జబర్దస్త్' నుంచి బయటికి వచ్చేశాడు. ఆ తరువాత 'నెల్లూరు పెద్దారెడ్డి' పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ ను ఆరంభించాడు.
తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఫీ మాట్లాడుతూ .. 'జబర్డస్త్' నుంచి నేను బయటికి రావడానికి కారణం .. నాగబాబుగారు మానేయడమే. ఆయన జడ్జి సీట్లో ఉంటే ఒక హోదా ఉండేది. స్కిట్స్ బాగా చేస్తే ఎంకరేజ్ చేసేవారు. బాగోలేకపోతే రూమ్ కి పిలిచి క్లాస్ పీకేవారు. అలాంటి ఆయన వెళ్లిపోవడంతో ఇక నేను కూడా ఆ స్టేజ్ కి దూరమయ్యాను" అన్నాడు.
'నెల్లూరు పెద్దారెడ్డి' పేరుతో చేపల పులుసు బిజినెస్ పెట్టాను. అసలు 'నెల్లూరు పెద్దారెడ్డి' ఎవరనేది నాకూ తెలియదు. ఆర్జీవీ సినిమాలో 'నెల్లూరు పెద్దారెడ్డి' గురించిన బ్రహ్మానందంగారి డైలాగ్ బాగా పాప్యులర్ అయింది. అందువలన నేను ఆ పేరు పెట్టాను. నాకు చేపల పులుసు బాగా పెట్టడం తెలుసు. వడ్డించడమంటే కూడా ఇష్టం. అందువల్లనే ఈ బిజినెస్ వైపు రావడం జరిగింది" అని చెప్పాడు.