Team India: రాంచీ టెస్టులో కష్టాల్లో టీమిండియా
- టీమిండియా, ఇంగ్లండ్ నాలుగో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 ఆలౌట్
- తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- 73 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్
- 4 వికెట్లతో టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీసిన ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్
రాంచీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కుదుపులకు గురైంది. ఇవాళ ఆటకు రెండో రోజు కాగా... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 161 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లతో టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఆండర్సన్ ఒక వికెట్ తీశాడు.
సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ 28, రజత్ పాటిదార్ 17, రవీంద్ర జడేజా 12 పరుగులు చేశారు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 51 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు. సర్ఫరాజ్ ఖాన్ 14, ధ్రువ్ జురెల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 182 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి.