Vijay: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ పై సినీ నటుడు రంజిత్ తీవ్ర వ్యాఖ్యలు

Actor Ranjith comments on Vijay
  • అధికార దాహంతోనే విజయ్ రాజకీయాల్లోకి వచ్చారన్న రంజిత్
  • వెయ్యి మంది విజయ్ లు వచ్చినా రాష్ట్రాన్ని బాగు చేయలేరని వ్యాఖ్య
  • త్రిష వ్యవహారంలో ఎవరినీ తప్పుపట్టలేమన్న రంజిత్
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో ఆయన సొంత పార్టీని ప్రారంభించారు. మరోవైపు, విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా తమిళనాడులో మార్పు తీసుకురాలేరని చెప్పారు. 

ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు డబ్బులు పంచే వారిని ప్రజలు గెలిపించకూడదని రంజిత్ అన్నారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు ఎన్నికలను బహిష్కరించకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో స్వలాభం కోసం కొందరు పార్టీలు మారుతుంటారని... దీనికి విజయధరణి మంచి ఉదాహరణ అని చెప్పారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి మద్యం అమ్మకాలను తగ్గిస్తామని చెపుతుంటారని... కానీ, విక్రయాలను పెంచుకుంటూనే పోతున్నారని మండిపడ్డారు. సినీ నటి త్రిష వ్యవహారంలో ఎవరినీ తప్పుపట్టలేమని చెప్పారు.
రంజిత్
Vijay
Ranjith
Kollywood
Politics
Trisha

More Telugu News