Lavu Sri Krishna Devarayalu: చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

MP Lavu Sri Krishna Devarayalu goes to Chandrababu residence
  • వైసీపీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
  • టీడీపీలో చేరతానని ప్రకటన
  • నేడు చంద్రబాబుతో భేటీ
  • పార్టీలో చేరికపై చర్చ
టీడీపీలో మరో చేరికకు రంగం సిద్ధమవుతోంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సాయంత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్ననే వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, నేడు చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరిక, నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ, తదితర అంశాలపై ఆయన చంద్రబాబుతో చర్చిస్తున్నట్టు సమాచారం. 

నరసరావుపేట లోక్ సభ స్థానం ఈసారి బీసీకి కేటాయించిన నేపథ్యంలో, లావు శ్రీకృష్ణదేవరాయలుకు వైసీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయం సూచించగా, ఆయన అందుకు తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నప్పటికీ, తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
Lavu Sri Krishna Devarayalu
Chandrababu
TDP
YSRCP
Narasaraopet

More Telugu News