Rajya Sabha: కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Rajya Sabha votes counting continues

  • దేశంలో నేడు 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్
  • సాయంత్రం 4 గంటలకు ముగిసిన ఓటింగ్  
  • సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

నేడు 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగ్గా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. క్రాస్ ఓటింగ్ అనుమానాల నేపథ్యంలో, ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టారు. 

కాగా, ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని 10 రాజ్య సభ స్థానాలకు, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక స్థానానికి పోలింగ్ నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారం నాటికి దేశంలో 56 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో, ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 15 స్థానాలకు పోలింగ్ తప్పనిసరి అయింది. 

కాగా, ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన విందుకు 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉంటారన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News