PIA: కెనడా వెళ్లిన ఆ ఎయిర్ హోస్టెస్ లు ఏమయ్యారు?

PIA says their air hostesses went missing in Canada

  • కెనడాలో కనిపించకుండా పోతున్న పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్ లు
  • గతేడాది ఏడుగురు ఎయిర్ హోస్టెస్ లు మిస్సింగ్
  • ఈ ఏడాది ఇప్పటివరకు ఇద్దరు కనిపించకుండా పోయిన వైనం

విధి నిర్వహణలో భాగంగా కెనడా వెళుతున్న పీఐఏ (పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్) ఎయిర్ హోస్టెస్ లు ఆచూకీ లేకుండా పోతున్నారు. గతేడాది ఏకంగా ఏడుగురు ఎయిర్ హోస్టెస్ లు అదృశ్యమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు మాయమయ్యారు. 

ఇటీవల మరియం రజా అనే ఎయిర్ హోస్టెస్ పీకే-782 విమానంలో ఇస్లామాబాద్ నుంచి కెనడా వెళ్లింది. టొరంటోలో దిగిన అనంతరం ఆమె నుంచి సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు టొరంటో నుంచి కరాచీ వెళ్లే విమానంలో ఆమె విధులకు హాజరు కావాల్సి ఉండగా, ఆమె ఎంతకీ రాకపోవడంతో అధికారులు ఆమె హోటల్ గదిని పరిశీలించారు. కృతజ్ఞతలు పీఐఏ అంటూ ఓ లేఖను, ఆమె యూనిఫాంను కనుగొన్నారు. ఆమె ఎటు వెళ్లిందో మాత్రం తెలియదు. 

అయితే, అదృశ్యం అయిన ఎయిర్ హోస్టెస్ లు కెనడాలో స్థిరపడే ఉద్దేశంతో అక్కడే ఉండిపోతున్నారని భావిస్తున్నారు. 

కాగా, తమ సిబ్బంది కెనడాలో ఆచూకీ లేకుండా పోవడం కొత్తేమీ కాదని, 2019లో ఈ తంతు మొదలైందని పీఐఏ వెల్లడించింది. విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి కెనడా పారిపోయి అక్కడే స్థిరపడినట్టు తెలిపింది. ఆ ఉద్యోగి సలహాతో మిగతావాళ్లు కూడా కెనడా బాటపడుతున్నారని పీఐఏ వివరించింది. 

విదేశీయులకు కెనడాలో సులభంగా ఆశ్రయం లభిస్తుండడం కూడా తమ ఉద్యోగుల మిస్సింగ్ కు దారితీస్తోందని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అభిప్రాయపడింది. ఈ తరహా ఘటనలను అరికట్టడానికి కెనడా అధికారులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News