k laxman: తెలంగాణలో కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలనతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపణ
- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితిని మనమంతా చూస్తూనే ఉన్నామని వ్యాఖ్య
- అన్ని పార్టీల కంటే బీజేపీయే ప్రచారంలో దూసుకు వెళుతోందన్న లక్ష్మణ్
తెలంగాణలో కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన ఎన్టీవీ ముఖాముఖిలో మాట్లాడుతూ, నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలనతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనమంతా చూస్తూనే ఉన్నామని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ వచ్చే లోపు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవుతుందన్నారు.
అన్ని పార్టీల కంటే ప్రచారంలో బీజేపీయే దూసుకుపోతోందన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో తెలంగాణలో రెండు రోజులు పర్యటిస్తారని తెలిపారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేసిన వారు కూడా లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.