Lasya Nanditha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు.. టిప్పర్ డ్రైవర్ అరెస్ట్

Lasya Nanditha Car Accident Case Tipper Driver Arrested

  • టిప్పర్‌ను గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • తొలుత ఎవరు? ఎవరిని ఢీకొట్టారన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు
  • ఫిబ్రవరి 23న ఓఆర్ఆర్‌పై జరిగిన ప్రమాదంలో లాస్య మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్‌‌ను పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా టిప్పర్‌ను గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కారు తొలుత టిప్పర్‌ను ఢీకొట్టిందా? లేదంటే టిప్పరే కారును ఢీకొట్టిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ప్రమాదానికి ముందు లాస్య నందిత రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. తొలిసారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఆ ప్రమాదం నుంచి బయటపడిన కొన్ని రోజులకే నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభకు వెళ్లి వస్తూ గత నెల 13న మరోమారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  లాస్య తరచూ అనారోగ్యం పాలవుతుండడం, రెండు ప్రమాదాల నుండి బయటపడడంతో కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో ఫిబ్రవరి 22న రాత్రి సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్‌పాషా దర్గాకు వెళ్లి పూజలు చేయించుకున్నారు. అనంతరం తెల్లవారుజామున తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News