Prathipati Sarath: విజయవాడ కోర్టులో ప్రత్తిపాటి శరత్ బెయిల్ పిటిషన్.. విచారణ సోమవారానికి వాయిదా
- పన్ను ఎగవేత ఆరోపణలపై ప్రత్తిపాటి శరత్ అరెస్ట్
- గతరాత్రి జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులు
- శరత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శరత్ న్యాయవాదులు
- 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన పోలీసులు
టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ ను నిన్న విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి శరత్ ను పోలీసులు 1వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కరీముల్లా ఎదుట హాజరుపరిచారు. శరత్ కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
ఈ నేపథ్యంలో, శరత్ తరఫు న్యాయవాదులు నేడు 1వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.
అదే సమయంలో శరత్ ను మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నామని, అతడిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కూడా పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని ఇరువర్గాలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.