Rishab Panth Marbles: పిల్లలతో క్రికెటర్ గోలీలాట.. వీడియో ఇదిగో!

Rishabh Pant Plays Marbles With Local Kids Ahead Of IPL 2024
  • అభిమానులతో కలిసి పిల్లాడిలా మారిన రిషబ్ పంత్
  • కారు ప్రమాదంతో క్రికెట్ కు దూరమైన టీమిండియా ప్లేయర్
  • ఐపీఎల్ కోసం నెట్ ప్రాక్టీస్.. మంగళవారం ఫిట్ నెస్ టెస్ట్
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమైన క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల కోసం నెట్‌ లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆటవిడుపుగా కొంతమంది చిన్నారి అభిమానులను కలిశాడు. వీధిలో కారు దిగి వారితో కాసేపు ముచ్చటించాడు. తనను చూసి గోలీలాట ఆపేసిన పిల్లలతో పంత్ కలిసిపోయాడు. వారితో పాటు కాసేపు గోలీలాడాడు. ముఖానికి కర్చీఫ్ చుట్టుకుని పిల్లలతో గోలీలాడుతున్న వీడియోను పంత్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంత్ పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ కే అంకితమయ్యాడు. ఫిట్ నెస్ కోసం జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా, ఈ నెల 5న పంత్ ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ టెస్టులో పాస్ అయితే ఢిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ పంత్ కు అప్పగించే విషయంపై చర్చిస్తామని వివరించారు.
Rishab Panth Marbles
IPL 2024
Delhi capitals
Panth with kids
Viral Videos

More Telugu News