India TV CNX opinion poll: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక ఎంపీ స్థానాలు.. వెలువడిన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్
- బీజేపీ-5, బీఆర్ఎస్-2 స్థానాలు గెలుస్తాయని అంచనా
- ఎంఐఎం పార్టీ ఒక సీటు దక్కించుకుంటుందని విశ్లేషణ
- కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్
లోక్‌సభ ఎన్నికలు-2024లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకోనుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా అత్యధికంగా 9 స్థానాలను హస్తం పార్టీ గెలవనుందని లెక్కగట్టింది. ఇక బీజేపీ 5 చోట్ల విజయం సాధిస్తుందని విశ్లేషించింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని విశ్లేషించింది. ఇక రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితం కానుందని అంచనా వేసింది. ఇక అసదుద్దీన్ సారధ్యంలోని ఏఐఎంఐఎం పార్టీ ఒక సీటులో విజయం సాధిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం మరోసారి హస్తగతం చేసుకోనుందని పేర్కొంది.
ఇక గత లోక్‌సభ ఎన్నికలు-2019లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)- 9 సీట్లు, బీజేపీ - 4, కాంగ్రెస్ -3, ఏఐఎంఐఎం -1 సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు 2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్- 11, కాంగ్రెస్-2, బీజేపీ-1, ఏఐఎంఐఎం-1, టీడీపీ-1, వైఎస్సార్సీపీ-1 చోట్ల విజయం సాధించాయి.