Stock Market: స్టాక్ మార్కెట్లకు ఆద్యంతం నష్టాలే

markets ends in losses

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన స్టాక్ మార్కెట్లు
  • 195 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 49 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలబాట పట్టాయి. ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు నష్టపోయి 73,677కి పడిపోయింది. నిఫ్టీ 49 పాయింట్లు కోల్పోయి 22,356 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.52%), భారతి ఎయిర్ టెల్ (3.06%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.52%), సన్ ఫార్మా (1.41%), ఎన్టీపీసీ (1.26%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-4.28%), బజాజ్ ఫైనాన్స్ (-4.17%), ఇన్ఫోసిస్ (-1.93%), నెస్లే ఇండియా (-1.88%), టీసీఎస్ (-1.72%). 

  • Loading...

More Telugu News