Jagan: భోగాపురం ఎయిర్ పోర్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం జగన్
- నేడు ఉత్తరాంధ్రలో పర్యటించిన సీఎం జగన్
- విజన్ విశాఖ సదస్సుకు హాజరు
- హెలికాప్టర్ లో భోగాపురం ఎయిర్ పోర్టు పనుల పరిశీలన
ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉత్తరాంధ్రలో పర్యటించారు. విశాఖ సదస్సు అనంతరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్ లో భోగాపురం ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అధికారులను అడిగి నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.
భోగాపురం వద్ద రూ.4,592 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2023 మే 3న సీఎం జగన్ భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2,203 ఎకరాల భూమిలో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం జరుపుకుంటోంది.
తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ ఎయిర్ పోర్టు నిర్మించనున్నారు. అనంతరం, ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించేలా దశలవారీగా విమానాశ్రయం సామర్థ్యాన్ని పెంచనున్నారు.