Meta: మొరాయించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్
- మెటా సర్వీసులకు సాంకేతిక అంతరాయం
- హైరానా పడిన యూజర్లు
- లాగిన్ కాలేక అవస్థలు
మెటా సంస్థకు చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి సోషల్ సైట్లు మొరాయించాయి. కారణం ఏంటో కూడా తెలియదు. అప్పటికే లాగిన్ అయిన వారు కూడా... తమకు తెలియకుండానే లాగౌట్ అయ్యారు. ఎన్నిసార్లు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ టైప్ చేసినా లాగిన్ కాలేక, ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఒకవేళ తమ ఫేస్ బుక్ హ్యాక్ అయిందేమోనని కూడా యూజర్లు అనుమానించే పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తలెత్తిందని డౌన్ డిటెక్టర్ అనే ట్రాకింగ్ వెబ్ సైట్ వెల్లడించడంతో యూజర్లు కాస్త కుదుటపడ్డారు. ఈ సమస్యపై మెటా ఇంకా స్పందించలేదు. కొంత సమయం తర్వాత ఫేస్ బుక్ మళ్లీ ఓపెన్ అవుతున్నప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ మాత్రం సమ్ థింగ్ వెంట్ రాంగ్... రీలోడ్ పేజ్ అనే మెసేజ్ ను ప్రదర్శిస్తోంది.