YS Jagan: వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్
- నాడు తండ్రి వైఎస్ఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
- నేడు కొడుకు జగన్ సీఏం హోదాలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం
- దశాబ్దాల కల సాకారమైందని సీఏం జగన్ హర్షం
కొద్దిసేపటి క్రితం వెలిగొండ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. దశాబ్దాల కల సాకారమైనందుకు గర్వంగా ఉందన్నారు. అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 15.25 లక్షల మంది తాగునీటి సమస్య తీరడమనేది హర్షించదగినదిగా చెప్పుకొచ్చారు. అంతేగాక వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు 4.47లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఏం తెలిపారు.