Revanth Reddy: కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సీఏం రేవంత్‌రెడ్డి సూచన
- కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటార్న సీఏం
- కేంద్రంతో సఖ్యత కోసమే ప్రధాని మోదీని కలిసినట్లు వెల్లడి
- ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్న రేవంత్‌రెడ్డి
- బీఆర్ఎస్ హయాంలో పబ్బులు, గంజాయి, డ్రగ్స్ వచ్చాయని విమర్శ
మాజీ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సూచన చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటారని సీఏం చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో అంటీముట్టనట్టు ఉండడం వల్లే నిధులు రాలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంతో స్నేహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీతో పాటు రక్షణశాఖ మంత్రిని కలిశామన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం మెట్టుదిగడంలో తప్పేముందని అన్నారు. హైదరాబాద్‌లో రామగుండం ఎలివేటడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయమై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్న సీఏం.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పబ్బులు, గంజాయి, డ్రగ్స్ వచ్చాయని దుయ్యబట్టారు.