Rameshwaram Cafe: బ‌స్సులో ప్ర‌యాణించిన‌ రామేశ్వ‌రం కేఫ్ బాంబు పేలుడు నిందితుడు.. ఫొటోలు వైర‌ల్‌

Bengaluru Rameshwaram Cafe blast accused inside BMTC Bus

  • పేలుడు త‌ర్వాత‌ బ‌స్సులో తుముకూరుకు నిందితుడు
  • ఆచూకీ చెప్పిన వారికి రూ.10ల‌క్ష‌ల రివార్డు ప్ర‌క‌టించిన ఎన్ఐఏ
  • నిందితుడి కోసం తుముకూరు, బ‌ళ్లారిల‌లో ముమ్మ‌ర గాలింపు
  • నిందితుడి గురించి కొంత స‌మాచారం దొరికినట్లు హోంమంత్రి ప‌ర‌మేశ్వ‌ర వెల్ల‌డి

బెంగ‌ళూరు రామేశ్వ‌రం కేఫ్‌లో బాంబు పేలుడుకు పాల్ప‌డిన ప్ర‌ధాన నిందితుడి కోసం అధికారులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఇప్ప‌టికీ నిందితుడి ఆచూకీ ఇంకా దొర‌క‌లేదు. అయితే, తాజాగా అత‌డు ఓ బ‌స్సులో ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో అత‌డు న‌ల్ల‌రంగు టోపీ, మాస్క్‌, అద్దాలు పెట్టుకుని ఉండ‌డం మ‌నం చూడొచ్చు. 

కాగా, బుధ‌వారం రాత్రి జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిందితుడి ఫొటోలు విడుద‌ల చేయ‌డంతో పాటు ఆచూకీ లేదా వివ‌రాలు చెప్పిన వారికి రూ.10ల‌క్ష‌ల రివార్డు కూడా ప్ర‌క‌టించింది. ఇక బుధ‌వారం ఎన్ఐఏ అధికారులు నిందితుడి కోసం తుముకూరు, బ‌ళ్లారిల‌లో ముమ్మ‌రంగా గాలించాయి. ఈ గాలింపు చ‌ర్య‌ల వ‌ల్ల నిందితుడి గురించి అధికారులకు కొంతమేర‌ స‌మాచారం దొరికిన‌ట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ప‌ర‌మేశ్వ‌ర వెల్ల‌డించారు. పేలుడు త‌ర్వాత‌ నిందితుడు బ‌స్సులోనే తుముకూరుకు వ‌చ్చిన‌ట్లు త‌మ విచార‌ణ‌లో తెలిసింద‌న్నారు.

  • Loading...

More Telugu News