Narendra Modi: ఉజ్వల పథకం కింద రూ.300 గ్యాస్ రాయితీని మరో ఏడాది పొడిగించిన కేంద్రం

Govt extends Rs 300 subsidy on LPG cylinder under Ujjwala scheme by one year

  • PMUY కింద రూ.300కే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ 
  • ఉజ్వల పథకం కింద సంవత్సరానికి 12 రీఫిల్ సిలిండర్లు
  • అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్న కేంద్రం

ఉజ్వల పథకం గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లకు రాయితీ గడువును మరో ఏడాది పొడిగించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ గ్యాస్‌పై రూ.300 రాయితీని అందిస్తోంది. ఈ గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది.

PMUY లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ సిలిండర్ రాయితీ కింద రూ.300 అందిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. సబ్సిడీ మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News