Nara Lokesh: లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఏం విజన్ ఉంటుంది?: నారా లోకేశ్
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ శంఖారావం యాత్ర
- నేడు హిందూపురం, పెనుకొండలో సభలు
- బీసీలకు జగన్ పొడిచిందేమీ లేదన్న లోకేశ్
- పెనుకొండ ఎమ్మెల్యే ఒక అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు శంఖారావం యాత్ర ప్రారంభించారు. తొలుత హిందూపురం సభలో పాల్గొన్న లోకేశ్, అనంతరం పెనుకొండ సభకు హాజరయ్యారు. ఈ సభలో నారా లోకేశ్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఏం విజన్ ఉంటుంది? అని వ్యంగ్యం ప్రదర్శించారు. అతడికి మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి... ఇసుకలో ఎలా డబ్బులు లేపేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు వెళ్లి తనకు విజన్ ఉంది అంటున్నాడు" అని లోకేశ్ ఎద్దేవా చేశారు.
"మూడేళ్లుగా 3 రాజధానులతో మనల్ని ఆడుకున్నాడు. విశాఖలో జగన్ మొదట చేసింది ఏంటో తెలుసా? రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్రూమ్ లో రూ.25 లక్షలతో కమోడ్ పెట్టుకున్నాడు. బస్ షెల్టర్ కు కూడా ఫొటోలు పెట్టుకున్నాడు. అవి గాలి వస్తే ఊడిపోతున్నాయి. ఇటీవల సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే అది కూడా కొట్టుకుపోయింది" అని ఎద్దేవా చేశారు.
బీసీలకు జగన్ పొడిచిందేమిటి?
జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా... ఎన్నికల ముందు బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నాడు. కానీ బీసీల వెన్ను విరిచాడు. బీసీలకు జగన్ పొడిచిందేంటి?
అందుకే బీసీలకు డిక్లరేషన్ తీసుకొచ్చాం. 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేల నెలకు పింఛన్ ఇవ్వబోతున్నాం. బీసీల రక్షణకు చట్టం తీసుకురాబోతున్నాం. సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.5 వేల కోట్లతో ఆదరణ ద్వారా పనిముట్లు కూడా అందిస్తాం. చంద్రన్న బీమా 10 లక్షలు, పెళ్లి కానుక ద్వారా రూ.లక్ష ఇవ్వబోతున్నాం. అధికారుల చుట్టూ ఆరునెలలకు ఒకసారి తిరగకుండా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం ఇస్తాం. పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలు నిర్మిస్తాం.
ఈ ఎమ్మెల్యే ఒక అవినీతి అనకొండ!
గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశారు? ఆయనో అవినీతి అనకొండ. అన్నదమ్ములు నియోజకవర్గాన్ని కేక్ లా కట్ చేసుకున్నారు. కియా అనుబంధ సంస్థల వాళ్లను బెదిరించి మామూళ్లు అడగడంతో వెనక్కి పోయారు. లేబర్ కాంట్రాక్టులు తీసుకుని సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు.
లే అవుట్ వేయాలంటే కమీషన్... సెంటు పట్టా కావాలన్నా కమీషన్ కట్టాల్సిందే. అందుకే ఈ సైకోను పక్క నియోజకవర్గానికి తరిమేశారు. పెనుకొండలో టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి సవితను గెలిపించి శాసనసభకు పంపండి. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత మాది.
రేపటి శంఖారావం వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా
08-03-2024 (శుక్రవారం)
పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ప్రసంగం.
10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32 – పుట్టపర్తి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పి.చంద్రశేఖర్ ప్రసంగం.
10.34– పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి ప్రసంగం.
10.36– పుట్టపర్తి నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
మధ్యాహ్నం
1.00 – లోకేశ్ మడకశిర కదిరి చేరిక.
2.30 – కదిరి నియోజకవర్గంలో భోజన విరామం.
కదిరి నియోజకవర్గం
2.30 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ప్రసంగం.
2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
3.02 – కదిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త భైరవ ప్రసాద్ ప్రసంగం.
3.04 – కదిరి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ప్రసంగం.
3.06– కదిరి నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.59 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ