Gold: వరుసగా రెండోరోజూ తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold and silver prices witness dip on MCX Today

  • ఎంసీఎక్స్‌లో అతి స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 కేరెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 60,900, వెండి కిలో రూ. 75,600
  • చెన్నైలో మాత్రం 10 గ్రాముల బంగారం రూ. 61,500, వెండి ఏకంగా రూ. 79 వేలు

మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో వరుసగా రెండోరోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఏప్రిల్ 5తో ముగిసే గోల్డ్ ఫీచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 8 (0.01 శాతం) తగ్గి రూ. 66,015గా ఉంది. అంతకుముందు రూ. 66,023 వద్ద ముగిసింది. 

మే 3తో ముగిసే సిల్వర్ ఫీచర్స్‌లో వెండి ధర రూ. 77 (0.10శాతం) తగ్గి కిలో రూ. 74,185గా నమోదైంది. అంతకుముందు దాని ధర రూ. 74,262 వద్ద ముగిసింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,900గా ఉండగా, వెండి ధర కేజీ రూ. 75,600గా ఉంది. ముంబైలో వీటి ధరలు వరుసగా రూ. 60,750, రూ. 75,600, కోల్‌కతాలో రూ. 60,750, రూ. 75,600, చెన్నైలో రూ. 61,500, రూ. 79,000గా ఉన్నాయి.

  • Loading...

More Telugu News