cas: CAA అమలుపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- సీఏఏ నిబంధనలను అయిదేళ్ల పాటు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? అని ప్రశ్న
- సీఏఏపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడి
- మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని సూచన
పౌరసత్వ సవరణ బిల్లు-2019 (CAA)ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకు రావడంపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సోమవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా... సీఏఏ నిబంధనలను అయిదేళ్ల పాటు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఇప్పుడు ఎన్నికలకు ముందు అమలు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని సూచించారు. ముస్లింలు లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్పీ-ఎన్ఆర్సీ తీసుకు వచ్చారని ఆరోపించారు.