Maharashtra: అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్గా మారుస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం
- బ్రిటీష్ కాలం నాటి 8 ముంబై రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చాలని కేబినెట్ నిర్ణయం
- ఉత్తాన్ (భయందర్), విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర మార్గాన్ని నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం
- శ్రీనగర్, జమ్మూ కశ్మీర్లలో మహారాష్ట్ర భవన్ నిర్మించడానికి 2.5 ఎకరాల భూమి కొనుగోలు చేయాలని తీర్మానం
అహ్మద్ నగర్ పేరును అహల్యనగర్గా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అదే సమయంలో బ్రిటీష్ కాలం నాటి పేర్లుగా ఉన్న 8 ముంబై రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్తాన్ (భయందర్), విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర మార్గాన్ని నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది.
శ్రీనగర్, జమ్మూ కశ్మీర్లలో మహారాష్ట్ర భవన్ నిర్మించడానికి 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర అసెంబ్లీ గత బడ్జెట్ సమావేశాల్లోనే ఓ ప్రతిపాదన చేసింది. 18వ శతాబ్దం నాటి అహల్యాబాయి హోల్కర్ పేరు మీద అహల్యనగర్ అని పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.