Andhra Pradesh: ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష 

AP CEO Mukesh Kumar Meena held video conference ahead of election schedule
  • ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఈవో వీడియో కాన్ఫరెన్స్
  • ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం
ఎల్లుండి (మార్చి 15) ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల దృష్ట్యా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఓటరు కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. షెడ్యూల్ తర్వాత ఎన్నికల నియమావళి పటిష్ఠంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
Andhra Pradesh
Mukesh Kumar Meena
CEO
Elections

More Telugu News