Stock Market: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
- 335 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 149 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతం వరకు పెరిగిన హెచ్సీఎల్ షేర్ విలువ
నిన్న భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఈ ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు... కాసేపటికే కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్లు లాభపడి 73,097కి చేరుకుంది. నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 22,147 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.96%), విప్రో (2.63%), ఇన్ఫోసిస్ (2.53%), భారతి ఎయిర్ టెల్ (2.23%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.09%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.33%), బజాజ్ ఫైనాన్స్ (-1.05%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.82%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.76%).