Anil Kumar Yadav: చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట వైసీసీ ఇన్చార్జి అనిల్ కుమార్ యాదవ్
- చంద్రబాబుకు సిగ్గు, శరం, మానం, లజ్జ లేవన్న అనిల్ కుమార్
- కాండ్రించి ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోతాడని వ్యాఖ్యలు
- జనసేన, టీడీపీలను ఎన్నికలయ్యాక బీజేపీలో కలిపేస్తారని జోస్యం
నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, నరసరావుపేట లోక్ సభ స్థానం వైసీపీ ఇన్చార్జి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాండ్రించి ముఖంపై ఉమ్మేసినా తుడుచుకుని ముందుకు వెళ్లే వ్యక్తి అని పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడికి సిగ్గు, శరం, మానం, లజ్జ వంటివేవీ లేవని, ఏ అబద్ధమైనా చెబుతాడని, ఎవడితోనైనా పొత్తు పెట్టుకుంటాడని అన్నారు. పొద్దున్నే తిడతాడు... సాయంత్రం పొత్తుకు వెళతాడని, రాత్రికి ప్రజలను మోసం చేస్తాడని ఎద్దేవా చేశారు.
"జీవితంలో ఆడికి ఉచ్ఛనీచాలు లేవు. మామను చంపాడు, పార్టీని లాక్కున్నాడు. అసలు అతడు అసహ్యాన్ని జయించినవాడు" అని అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక బీజేపీ కాళ్లు పట్టుకుని పొత్తు కుదుర్చుకున్నారని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక జూన్ లో జనసేన పార్టీని బీజేపీలో కలిపేస్తామని పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతలకు చెప్పారని బయట అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.
"మీరు పొత్తుకు రండి స్వామీ... జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించి నిలిచే శక్తి మాకు లేదు అని బీజేపీని ఒప్పించాడు. బీజేపీకి కూడా శక్తి లేదనుకోండి... కానీ కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి మోదీని బూచిగా చూపించి జగన్ ను భయపెట్టవచ్చు అనుకుంటున్నారు. నువ్వు లేకపోతే యుద్ధానికి వెళ్లే ధైర్యం కూడా మా ఇద్దరికీ లేదు అని మోదీకి పవన్, చంద్రబాబు చెప్పారు. అందుకే బీజేపీ వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమలాడి మరీ పొత్తు పెట్టుకున్నారు" అని వివరించారు. టీడీపీని కూడా బీజేపీలో విలీనం చేస్తారని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు