Stock Market: అమెరికా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets ends in losses

  • 453 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 123 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4.75 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక వడ్డీ రేట్లు తగ్గింపుపై నీలిమేఘాలు కమ్ముకునేలా చేశాయి. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మన మార్కెట్లు కూడా అదే బాటలో నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు నష్టపోయి 72,643కి పడిపోయింది. నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 22,023 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.10%), బజాజ్ ఫైనాన్స్ (1.89%), మారుతి (0.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.30%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.75%), టాటా మోటార్స్ (-2.23%), ఎల్ అండ్ టీ (-1.97%), ఎన్టీపీసీ (-1.94%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.91%).

  • Loading...

More Telugu News