Roja: రోజాకు వ్యతిరేకంగా ఐదు మండలాల నేతల నిరసన.. టికెట్ ఇవ్వొద్దని జగన్ కు విన్నపం
- సొంత పార్టీ నుంచే రోజాకు వ్యతిరేకత
- జగనన్న ముద్దు - రోజా వద్దు అంటూ ప్రకార్డుల ప్రదర్శన
- రోజాకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని స్పష్టీకరణ
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంతో సాంత పార్టీ నుంచే మంత్రి రోజాకు వ్యతరేకత ఎదురవుతోంది. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ ను వారు కోరారు. జగనన్న ముద్దు - రోజా వద్దు అని ప్లకార్డులు ప్రదర్శించారు.
తాము సపోర్ట్ చేయడం వల్లే నగరి నుంచి రోజా రెండు సార్లు గెలిచారని ఆమె వ్యతిరేక వర్గీయులు అన్నారు. సొంత చరిష్మాతో రోజా గెలిచే పరిస్థితే లేదని చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలంతా నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. తామంతా సపోర్ట్ చేస్తేనే రోజా గెలిచారని చెప్పారు. ఒక వేళ రోజాకు టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతారని... తాము కూడా ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కార్యకర్తలతో రోజా చాలా చులకనగా మాట్లాడతారని విమర్శించారు.
నగరి నియోజవర్గాన్ని రోజా, ఆయన సోదరులు దోచేశారని ఆరోపించారు. తమ అనుచరులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. తమను జగన్ బుజ్జగించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రోజా వల్ల పార్టీకి ఎంతో నష్టం జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని జగన్ గమనించాలని చెప్పారు.