Virat Kohli: కోహ్లీ వచ్చేస్తున్నాడు... ఆర్సీబీ క్యాంప్‌తో కలవనున్న స్టార్ క్రికెటర్

Virat Kohli to join RCB pre tournament camp Says reports

  • తొలి మ్యాచ్‌కు ముందే టీమ్ ప్రీ-టోర్నీ క్యాంప్‌లో చేరనున్న కింగ్
  • ఆర్సీబీకి అందుబాటులోకి మరో క్రికెటర్ కామెరూన్ గ్రీన్
  • మార్చి 22న బెంగళూరు, చెన్నై మధ్య జరగనున్న తొలి మ్యాచ్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలవబోతున్నాడని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఏ తేదీన ఆర్సీబీ శిబిరంతో కలుస్తాడనే విషయంలో క్లారిటీ లేదు కానీ ప్రీ-టోర్నీ క్యాంప్‌లో చేరడం ఖాయమైందని రిపోర్టులు తెలిపాయి.

కాగా మార్చి 22న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే కోహ్లీ శిక్షణా శిబిరంలో చేరతాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది. స్వదేశంలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌ మ్యాచ్‌ నుంచి గైర్హాజరీకి  ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కామెరాన్ గ్రీన్ కూడా తొలి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడని పేర్కొంది.

కాగా గతేడాది సీజన్ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారని, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఫినిషర్‌గా ఉంటాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఐపీఎల్ 2023లో కోహ్లీ 14 మ్యాచ్‌లు ఆడి మొత్తం 639 పరుగులు బాదాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్ట్ సిరీస్‌లో ఆడలేదు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటీదార్, ఆకాశ్ దీప్, మయాన్సెక్, మయాన్సెక్ టాప్లీ, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్.

  • Loading...

More Telugu News