Lok Sabha Polls: ఎన్నికల షెడ్యూల్‌ను ప్రస్తావిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన కమల్ హాసన్

Try One Election One Phase before One Nation One Election Kamal Haasan digs BJP

  • ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రయత్నించడానికి ముందు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించలేమా అంటూ కేంద్రంపై విమర్శలు
  • ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కమల్ హాసన్ స్పందన
  • ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తున్న నేపథ్యంలో మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడి విమర్శలు

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ప్రయత్నించడానికి ముందు 'వన్ ఎలక్షన్ వన్ ఫేజ్' ప్రయత్నించలేమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. 2029లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ నిర్వహించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో కమల్ హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు 2024ను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 543 పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ మొదలుకానుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న మొదటి దశలో 102 స్థానాలకు, ఏప్రిల్ 26న రెండో దశలో 89 నియోజకవర్గాలకు, మే 7న మూడో దశలో 94 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక మే 13న 4వ దశలో 96 లోక్‌సభ స్థానాలకు, మే 20న 5వ దశలో 49 లోక్‌సభ స్థానాలకు, మే 25న 6వ దశలో 57 పార్లమెంట్ స్థానాలకు, చివరిదైన 7వ దశ జూన్ 1న 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News