Vijayasai Reddy: టీడీపీ గెలుస్తుందనే నమ్మకం బీజేపీకి కూడా లేదు: విజయసాయి రెడ్డి
- రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని వ్యాఖ్య
- సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు బీజేపీ టార్గెట్
- అందులో టీడీపీ వాటా సున్నా అంటూ వైసీపీ నేత ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఏమేరకు ప్రభావం చూపుతుందనే విషయంలో బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ మీద బీజేపీ నేతలు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని చెప్పారు. కనీసం ఒక్క స్థానంలోనైనా టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పినా బీజేపీ నమ్మదని, టీడీపీ శక్తిసామర్థ్యాలు ఏ పాటివనే విషయం బీజేపీకి తెలుసన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తను సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
అదేవిధంగా ఎన్డీయే కూటమి 400 చోట్ల విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుందన్నారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ, ఎన్సీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు 30 లోక్ సభ సీట్లు వస్తాయని కేంద్రంలోని బీజేపీ పెద్దల అభిప్రాయం. అయితే, ఇందులో టీడీపీ, జనసేనల వాటా సున్నా అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.